భానుపురి (సూర్యాపేట) : ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌న్ లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో మొత్తం 107 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, జడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


