బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు

Jul 14 2026 6:10 AM | Updated on Jul 14 2026 6:10 AM

సూర్యాపేటటౌన్‌ : పోలీస్‌ స్టేషన్‌లకు వచ్చే ఫిర్యాదు దారులకు త్వరిగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ గ్రీవెన్స్‌ డే కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులు తమ ఎస్పీని ప్రత్యక్షంగా కలిసి వినతులు సమర్పించారు. ఎస్పీ వారితో మాట్లాడి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement