ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనే లక్ష్యం

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశించారు. మంగళవారం పాఠశాలల ఆధునికీకరణపై ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో వెబ్‌ ఎక్స్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. ప్రతి తరగతి గదిలో సరిపడా గాలి, వెలుతురు ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులు కూర్చునే బెంచీలు సౌకర్యవంతంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్‌ శ్రావణ్‌ కుమార్‌, డీఈ రమేష్‌, ఏఈ ఓబులేష్‌, తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement