పాత పెన్షన్‌ అమలయ్యే దాకా పోరాటం | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ అమలయ్యే దాకా పోరాటం

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

హుజూర్‌నగర్‌, సూర్యాపేట టౌన్‌ : ప్రస్తుతం ఉన్న సీపీఎస్‌ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(టీఎస్‌ సీపీఎస్‌ ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు గంగారపు స్థిత ప్రజ్ఞ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జన జాగరణ యాత్ర మంగళవారం హుజూర్‌నగర్‌కు ఆ తరువాత సూర్యాపేటకు చేరుకుంది. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 11న ప్రారంభమైన జనజాగరణ యాత్ర 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో కొనసాగుతోందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు హిమాచల్‌ ప్రదేశ్‌లో పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించినట్లే తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరారు. సుమారు 2.6 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ్యులకు వినతిపత్రాలు అందజేస్తున్నామన్నారు. హుజూర్‌నగర్‌లో ర్యాలీగా వెళ్లి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీఎస్‌ సీపీఎస్‌ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీకాంత్‌, రాష్ట్ర కోశాధికారి మల్లికార్జున్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చంద్రకాంత్‌, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ఓరుగంటి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు, అంజయ్య, మణి, నాయకులు పాల్గొన్నారు.

సూర్యాపేటలో బైక్‌ ర్యాలీ

సీపీఎస్‌ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సంఘం జిల్లా కోశాధికారి గుయ్యాని ప్రసాద్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ యూసుఫ్‌, సంయుక్త కార్యదర్శి నారాయణదాసు సతీష్‌కుమార్‌, మామిడి సురేందర్‌, చిట్యాల సతీష్‌, సురభి శేఖర్‌, వీరారెడ్డి, షఫీ పాల్గొన్నారు.

టీఎస్‌ సీపీఎస్‌ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement