తుంగతుర్తి : ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ(సర్)ను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్యుమరేషన్ పత్రాల ఆన్‌లైన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారం అందుకున్న ప్రతి ఒక్కరూ దానిని వెంటనే నింపి బీఎల్‌ఓలకు అందించాలన్నారు. ఫారం అందించని వారి ఓట్లు జాబితా నుంచి తొలగించబడతాయని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ చలపతి, పంచాయతీ కార్యదర్శి మడిపెద్ది శ్రీను, బీఎల్‌ఓలు స్థానికులు ఉన్నారు.
ఫ అదనపు కలెక్టర్ హరిసింగ్


