వర్షపు నీటిని ఒడిసి పట్టాలి | - | Sakshi
Sakshi News home page

వర్షపు నీటిని ఒడిసి పట్టాలి

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

సూర్యాపేట అర్బన్‌ : వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చని సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిశెట్టి నివేదిత లక్షాది, కమిషనర్‌ హన్మంతరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శ్రీవర్షాన్ని పట్టుకోండిశ్రీ ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో పాటు కమిషనర్‌ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఇంట్లో, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని వృథాగా వదిలేయకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకుంటే భూగర్భ జలాలు పెరిగి, భవిష్యత్తులో తాగునీటి కొరతను అధిగమించవచ్చని అన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్‌ ఇంజనీర్లు, వార్డు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement