లెక్కల్లోనే మొక్కలు ! | - | Sakshi
Sakshi News home page

లెక్కల్లోనే మొక్కలు !

Jun 25 2026 5:53 AM | Updated on Jun 25 2026 5:53 AM

యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలి

మున్సిపాలిటీలో కొత్తగా కొలువుదీరిన నూతన పాలకవర్గమైనా ఈ సమస్యపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో ప్రారంభం కానున్న ‘వనమహోత్సవం’ కార్యక్రమంలో కేవలం ఫోటోలకు పరిమితం కాకుండా.. అధికారులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి, నాటిన ప్రతి మొక్కను దత్తత తీసుకుని సంరక్షించేలా పటిష్ట చర్యలు చేపట్టాలి. అలాగే, రోడ్డు వెంట ఉన్న చెట్లను తొలగించే షాపు యజమానులపై భారీగా జరిమానాలు విధించేలా పాలకవర్గం కఠిన తీర్మానం చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

కోదాడరూరల్‌ : అడవుల శాతాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం హరితహారం నిర్వహించగా.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కోదాడ పట్టణంలో గత 11 ఏళ్లుగా ఏడాదికి 2 లక్షల చొప్పున.. పట్టణంలో ఏకంగా 22 లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. కానీ, అందులో కనీసం ఒక్క శాతం మొక్కలు కూడా నేడు పట్టణంలో లేకపోవడం గమనార్హం. మున్సిపల్‌ అధికారులు చూపిస్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది.

కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపు

22 లక్షల మొక్కల నిర్వహణ, ట్రీగార్డుల కొనుగోలు, నర్సరీల పెంపకం, నీటి వసతి కల్పన పేరుతో మున్సిపల్‌ అధికారులు కోట్ల రూపాయల బిల్లులు అధికారులు చెల్లించారు. నాటిన మొక్కల్లో కనీసం 10 శాతం బతికినా పట్టణం ఎంతో పచ్చగా ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు.

60 ఏళ్ల నాటి వృక్షాలే దిక్కు..

పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఎక్కడా చెట్లు లేకపోవడంతో బాటసారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హుజూర్‌నగర్‌ రోడ్డు మూలమలుపులో ఉన్న రెండు చెట్లు మినహాయిస్తే, ఎల్‌ఐసీ కార్యాలయం వరకు ఒక్క మొక్క కూడా కనిపించదు.

రంగా థియేటర్‌ నుంచి కొమరబండ వరకు కేవలం ఐదారు చెట్లు మాత్రమే మిగిలాయి. హైదరాబాద్‌–విజయవాడ పాత జాతీయ రహదారి వెంట దాదాపు 60 ఏళ్ల కిందట నాటిన చెట్లే నేటికీ ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి. పట్టణంలో ప్రస్తుతం మిగిలి ఉన్న సుమారు 25 మహావృక్షాల నీడలోనే బాటసారులు సేదతీరుతున్నారు.

షాపుల బోర్డుల కోసం చెట్ల నరికివేత!

పట్టణంలోని ప్రధాన రహదారులైన హుజూర్‌నగర్‌రోడ్‌, సూర్యాపేటరోడ్‌, ఖమ్మంరోడ్‌, విజయవాడ రోడ్ల వెంట ‘లోకహిత’ అనే స్వచ్ఛంద సంస్థ సొంత ఖర్చులతో వందలాది మొక్కలు నాటగా.. అవి చెట్లుగా మారాయి. అయితే, రోడ్డు పక్కన ఉన్న షాపుల యజమానులు తమ వ్యాపార బోర్డులు కనిపించడం లేదనే సాకుతో చెట్ల కొమ్మలను నరికివేస్తూ, చివరకు వేర్లతో సహా తొలగిస్తున్నారు.

ఫ కోదాడ మున్సిపాలిటీలో కాగితాలకే పరిమితమైన పచ్చదనం

ఫ 11 ఏళ్లలో 22 లక్షల మొక్కలు

నాటినట్లు రికార్డులు

ఫ నేటికీ 60 ఏళ్ల నాటి చెట్లే దిక్కు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement