సదుపాయాల కల్పనలో రాజీ లేదు | - | Sakshi
Sakshi News home page

సదుపాయాల కల్పనలో రాజీ లేదు

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

సదుపాయాల కల్పనలో రాజీ లేదు

హుజూర్‌నగర్‌ : ప్రజలకు మెరుగైన మౌళిక సదుపాయాల కల్పనలో రాజీ పడబోమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. హుజూర్‌నగర్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో నీటిపారుదలశాఖ సీఈ నాగభూషణరావు, ఈఈ రామకిషోర్‌, ఆర్‌డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్‌ కవిత, డీఈ చంద్రశేఖర్‌, ఏఈలు సరిత, ప్రసన్న, నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా మంత్రి పుట్టినరోజు వేడుక

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో కాంగ్రెస్‌ నాయకులు ఏర్పా టు చేసిన కేక్‌ను మంత్రి కట్‌ చేశారు. నాయకులు మంత్రిని గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ తన్నీరు మల్లిఖార్జున్‌, రాష్ట్ర పెరికకార్పొరేషన్‌ చైర్మన్‌ దొంగరి సత్యనారాయణ, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి, మాజీ ఎంపీపీలు గూడెపు శ్రీనివాస్‌, భూక్యా గోపాల్‌, శిరాంయాదవ్‌, సంపత్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement