భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు హాజరు కావాలని, జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో మొత్తం 76 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజు, జడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ్, డీఎఫ్‌ఓ దామోదర్ రెడ్డి, సీపీఓ కిషన్, డీఈఓ అశోక్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్


