నేరేడుచర్ల : డీఏపీని అధిక ధరకు విక్రయిస్తే షాపుల లైసెన్స్‌లను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏఓ) జి.శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నేరేడుచర్లలోని జయలక్ష్మి ఫర్టిలైజర్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అధిక ధరలకు విక్రయించే వారిపై కేసులను నమెదు చేస్తామన్నారు. ఇటీవల మద్దిరాలలో స్వర్ణ ఫర్టిలైజర్స్ లైసెన్స్‌ను రద్దు చేశామని గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా 797 మెట్రిక్ టన్నుల డీఏపీ డీలర్లు, సొసైటీల వద్ద అందుబాటులో ఉందని, ఈ సీజన్‌కు గాను యూరియా 10,981 మెట్రిక్ టన్నులు, పొటాష్ 844 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 15,712 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌బీ 1,063 టన్నులతో కలిపి మొత్తం 29,399 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 600 మంది లైసెన్స్‌లు కలిగిన డీలర్లు ఉన్నందున లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే ఎరువులు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. జిల్లాలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి జావీద్ ఉన్నారు.
ఫ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి


