అలాగే వదిలేస్తూ..
పంటను కాపాడుకోవాలనే ఆత్రుతలో రూ.లక్షలు వెచ్చించి బోర్లు వేస్తున్న రైతులు నీరు పడక పోవడంతో వాటిని అలాగే వదిలేస్తున్నారు. దాంతో బోరు గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. చేలల్లో మేతకు తిరిగే జీవాలతో పాటు వాటిని కాసే వారి పిల్లలు, రైతుల పిల్లలు బోరుగుంతలో పడే ప్రమాదం ఉంది. ఇటీవల మిర్యాలగూడ మండలంలో బోరు గుంతలో పడిన బాలుడిని రక్షించేందుకు యత్నించిన తాత కూడా అందులోనే పడి మృతి చెందాడు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నీరు పడని బోరు గుంతలను వెంటనే పూడ్చి వేయాలని, అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : వానాకాలం సీజన్ ప్రారంభమైనా పెద్దగా వర్షాలు లేక పోవడం, కాల్వల ద్వారా సాగునీరు వచ్చే అంచనాలు లేక పోవడంతో రైతులు తమ పొలాల్లో బోర్లు వేయిస్తున్నారు. నాన్ ఆయకట్టు మండలమైన ఆత్మకూరు ఎస్‌లో ఎక్కువ మంది రైతులు బోర్ల బాట పట్టారు. ఒక బోరులో నీరు పడకుంటే వేరే చోట ఇంకో బోరు వేస్తున్నారు. నీరు పడని బోరు గుంతలోని కేసింగ్ సైతం తొలగించి అలాగే వదిలేస్తున్నారు. దాంతో అవి ప్రమాదకరంగా మారుతున్నాయి.
రెండు నెలల్లో 5వేల బోర్లు
ఆత్మకూర్ ఎస్ మండలానికి గతంలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వల ద్వారా సాగునీరు వచ్చేవి. దాంతో ఎక్కువ మంది రైతులు మెట్ట పంటలు వదిలేసి తమ భూములను వరి సాగుకు అనుకూలంగా తయారు చేసుకున్నారు. రెండు సంవత్సరాలుగా ఎస్సారెస్పీ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో రైతులు బోర్లపై ఆధార పడుతున్నారు. మండల వ్యాప్తంగా మే, జూన్‌లో దాదాపు 5 వేలకు పైగా బోర్లు వేసినట్లు సమాచారం. అందులో కేవలం 500 బోర్లలో మాత్రమే నీళ్లు పడ్డాయని రైతులు చెబుతున్నారు. మండల కేంద్రానికి చెందిన రైతు ఉప్పుల పాపయ్య తన మూడెకరాల భూమిలో ఈ సంవత్సరం 8 బోర్లు వేయగా ఒక్క దాంట్లో కూడా నీళ్లు రాలేదు.
ప్రమాదకరంగా బోరు గుంతలు
వానాకాలం సాగు కోసం
బోర్లు వేస్తున్న రైతులు
నీరు పడకుంటే పూడ్చకుండా
వదిలేస్తున్న వైనం


