తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి పట్టణం నుంచి వెళ్తున్న నేషనల్ హైవే 930 పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గౌరెళ్లి నుంచి భద్రాచలం వరకు నిర్మిస్తున్న ఈ రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండడంతో కొద్దిపాటి వర్షానికే జలమయమవుతున్నాయి. స్థానిక చౌరస్తాలో డ్రెయినేజీ పనులు పూర్తి చేయక పోవడంతో మురుగు ముందుకు పారక కంపు కొడుతుంది. రోడ్డు పనులు ప్రారంభమై 5 సంవత్సరాలైనా నేటికీ పూర్తి చేయక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొలతలు తీసుకొని వదిలేశారు
నేషనల్ హైవే 930 పీ పనుల్లో భాగంగా తిరుమలగిరి పట్టణం మోత్కూరు–తొర్రూరు రోడ్డు వైపు చౌరస్తాలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. ఫ్‌లై ఓవర్ నిర్మిస్తే తమ వ్యాపారాలు దెబ్బ తింటాయని స్థానికులు పనులను అడ్డుకున్నారు. దాంతో రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పిన అధికారులు ఆమేరకు కొలతలు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు పనులు చేపట్ట లేదు. రోడ్డుతో పాటు సైడ్ డ్రెయిన్ నిర్మించక పోవడంతో కొద్దిపాటి వర్షానికే డ్రెయినేజీ నీరంతా రోడ్లపైకి చేరుతోంది. దానికి తోడు వర్షపు నీరు పోయే మార్గం లేక రోడ్లపైనే నిలిచి వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఫ కొద్దిపాటి వర్షానికే రోడ్లు జలమయం
ఫ నత్తనడకన జాతీయరహదారి
930 పనులు
ఫ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు


