అంగన్‌వాడీ పోస్టులకు నేడు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ పోస్టులకు నేడు నోటిఫికేషన్‌

Jul 10 2026 3:45 PM | Updated on Jul 10 2026 3:45 PM

భానుపురి (సూర్యాపేట) : అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. దాదాపు మూడు, నాలుగేళ్లుగా జిల్లాలో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో టీచర్లు, ఆయాలు లేకుండానే అంగన్‌వాడీలు నడుస్తున్నాయి. పిల్లల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ, ఆయాల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రకటన విడుదల కావడంతో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశ పడుతున్నారు.

1,209 అంగన్‌వాడీ కేంద్రాలు

సూర్యాపేట అర్బన్‌, చివ్వెంల, తుంగతుర్తి, హుజూర్‌నగర్‌, కోదాడ ప్రాజెక్టుల పరిధిలో 1,209 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. 67 టీచర్‌, 64 ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో చివ్వెంల అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలో 15 టీచర్లు, 20 ఆయాలు, తుంగతుర్తి ప్రాజెక్టు పరిధిలో 8 టీచర్లు, 19 ఆయాలు, హుజూర్‌నగర్‌ ప్రాజెక్టు పరిధిలో 17 టీచర్లు, 14 ఆయాలు, సూర్యాపేట అర్బన్‌ పరిధిలో టీచర్లు 8, ఆయాలు 9, కోదాడ పరిధిలో 19 టీచర్లు, 2 ఆయాల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.

24 వరకు దరఖాస్తుల స్వీకరణ

మొత్తం 131 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే ఈనెల 13 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌గా నిర్ణయించింది. ఆయా పోస్టులకు గిరిజన ప్రాంతాల్లో ఇంటర్‌ అభ్యర్థులు లేకుంటే ఎస్‌ఎస్‌సీ చదివిన వారిని పరిశీలించనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయస్సులో ఉండాలి. అభ్యర్థిని ఏ అంగన్‌వాడీ కేంద్రానికై తే దరఖాస్తు చేసుకుంటున్నారో.. ఆ గ్రామం, హాబిటేషన్‌, వార్డు నివాసై ఉండాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపిక విధానంలో ఇంటర్మీడియట్‌ మార్కుల మెరిట్‌, జిల్లా సెలక్షన్‌ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలకు రోస్టర్‌ నిబంధనలను పాటించనున్నారు.

ఫ భర్తీ కానున్న 131 టీచర్‌,

ఆయా పోస్టులు

ఫ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement