మునగాల: రాష్ట్రంలోని రైతులకు యూరియా లభ్యతను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ, సకాలంలో యూరియా పంపిణీ చేసే లక్ష్యంతో వ్యవసాయ శాఖ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో యూరియా బుకింగ్ చేసుకోలేని రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల్లో నేటి నుంచి బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
బుకింగ్ చేసుకునే విధానం
రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ (పీపీబీ) నంబర్‌తో సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. మీసేవ ఆపరేటర్ రైతు వివరాల ఆధారంగా సాగు విస్తీర్ణం, పంట వివరాలను సిస్టమ్‌లో నమోదు చేస్తారు. అనంతరం రైతు ఎంపిక చేసుకున్న ఎరువుల డీలరు వద్దకు అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేస్తారు. రైతు నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ధ్రువీకరించిన వెంటనే ‘బుకింగ్ ఐడీ’ జారీ అవుతుంది. కేవలం రూ.10ల నామమాత్రపు సేవా రుసుముతో రైతులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
ముఖ్యమైన సూచనలు ఇవీ..
మీసేవ ద్వారా పొందిన బుకింగ్ ఐడి బుకింగ్ చేసిన తేదీని మినహాయించి 48గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
బుకింగ్ గడువు ముగిసేలోపు రైతులు ఎంపిక చేసిన ఎరువుల డీలర్‌ను సంప్రదించి యూరి యాను కొనుగోలు చేయాలి.
సబ్సిడీ యూరియా బుకింగ్‌ను అధికారిక ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ లేదా మీసేవ కేంద్రాల ద్వారానే చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తుంది.
ఓటీపీ అందుకోవడానికి రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఉండేలా చూసుకోవాలి.
మీసేవ కేంద్రాలకు లాగిన్
సౌకర్యం కల్పించిన ప్రభుత్వం
నేటి నుంచి అందుబాటులోకి బుకింగ్


