ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
మోతె : ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, కోదాడ ఎమ్మెల్యే మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మోతె మండలం హుస్సేన్‌బాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు స్థానిక ఎమ్మెల్యేకు చెప్పుకోవాలంటే కారు కిరాయికి తీసుకొని హైదరాబాద్ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్యే స్థానికంగా ఉండి నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. కోదాడ నియోజవర్గంలో పలు పోలీస్ స్టేషన్లలో ఎస్‌ఐ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందన్నారు. వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శీలం సైదులు, మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ కట్కూరి ఉషి సంజీవరెడ్డి, సర్పంచ్ అక్కినపల్లి శ్రీరాములు, నిమ్మల రవి, జాన్‌రెడ్డి, సంజీవరెడ్డి, దేవ్లానాయక్, తదితరులు ఉన్నారు.


