ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారు
సూర్యాపేట : ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ నెల 28న పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా 95,281 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటు ఇటుకల బట్టీలు, సంచార జాతులు, స్లమ్, ఇతర ప్రాంతాల్లో మరో 809 మంది ఉంటారని భావిస్తున్నారు. వారందరికీ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించారు. 28న చుక్కలు వేయించని పిల్లలకు 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వేయనున్నారు.
ఉదయం 7 గంటల నుంచి
జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 575 కేంద్రాలను వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిబ్బంది ఉండి డ్రాప్స్ వేయనున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బస్ షెల్టర్ల వద్ద 11 ట్రాన్సిట్ కేంద్రాలను, 103 హైరిస్క్ ప్రాంతాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటితో పాటు 27 మొబైల్ బృందాలను నియమించారు.
2300 మంది సిబ్బంది
జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలియో చుక్కలు వేసేందుకు 2300 మంది ఉద్యోగుల సేవలను వినయోగించనున్నారు. ఈ విధుల్లో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఏఎన్‌ఎంలు, ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, సూపర్‌వైజర్లు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లును నియమించారు.
ఫ జిల్లాలో 575 పల్స్ పోలియో బూత్‌లు
ఫ 2300 మంది సిబ్బంది సేవలు
ఫ అన్ని ఆస్పత్రులకు వ్యాక్సిన్‌న్‌పంపిణీ చేసిన వైద్య ఆర్యోగ్య శాఖ
జిల్లాలో ఈ నెల 28 నుంచి 30 వరకు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తాం. దీని ద్వారా వైద్య సిబ్బంది 5 సంవత్సరాల లోపు 95,281 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. మొదటి రోజు పోలియో కేంద్రాల్లో, మిగతా రెండు రోజుల్లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లాలోని ప్రతి చిన్నారి పోలియో చుక్కలు వేసేందుకు తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సహకరించాలి.
–పెండెం వెంకటరమణ,
డీఎంహెచ్‌ఓ, సూర్యాపేట


