మేళ్లచెరువు : ప్రతి మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ డిమాండ్ చేశారు. శనివారం మేళ్లచెరువులో నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఉమ్మడి మేళ్లచెరువు మండలంలో వెయ్యి మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ విద్యకోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. కొంత మంది దూర ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే చదువు ఆపుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సంఘం నాయకులు నవీన్, ఆదినారాయణ, వీరబాబు, అనిల్, న రేష్, అభిరామ్, సతీష్, వినోద్ పాల్గొన్నారు.


