కోదాడరూరల్ : రైతు కూలీల సంక్షేమంతోపాటు వారిని ఆదుకోవడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐఎంఎస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని లాల్‌బంగ్లాలో జరిగిన ఆ సంఘం జిల్లా 2వ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడాన్ని పాలకులు విస్మరించారని విమర్శించారు. వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా.. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదల కోసం ఉపాధిహామీ పథకాన్ని తెచ్చి 16 కోట్ల మంది కూలీలకు పనులు కలిస్తుంటే నేడు బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చి కూలీలను మోసం చేసిందని ఆరోపించారు. పేదల శ్రమను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే నరేంద్రమోదీ ప్రభుత్వ దివాలాకోరు విధానాలపై రైతులు, కూలీలు, కార్మికులు ఉద్యమాలను తీవ్రతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సభలో సంఘం జిల్లా అధ్యక్షుడు పోటు లక్ష్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి డేవిడ్‌కుమార్, నాయకులు అలుగుబెల్లి వెంకటరెడ్డి, కాకి మోహన్‌రెడ్డి, దశరథ, కునుగుంట్ల సైదులు, దాసరి శ్రీను, కనకరావు, పారెల్లి నాగయ్య, నగేష్, అజయ్, ఉదయగిరి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
ఫ ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు


