భానుపురి, ఆత్మకూర్ (ఎస్), తిరుమలగిరి, కోదాడ రూరల్, తుంగతుర్తి, నేరేడుచర్ల : అత్యధిక మంది వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారున్న ప్రాంతం సూర్యాపేట. జిల్లాలో సుమారు 6 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. 3 లక్షలకు పైగా రైతులు సాగుపైనా ఆధారపడ్డారు. రైతన్నల కుటుంబాల్లోంచి ఎంతో మంది అధికారులుగా, ప్రజా ప్రతినిధులుగా, రాజకీయ నాయకులుగా ఎదిగారు. రైతుల పిల్లల్లో చాలా మంది తమ తల్లిదండ్రుల కాయకష్టం చూసి.. వ్యవసాయంలో వారికి ఎంతో కొంత సాయం చేద్దామని సాగు రంగాన్ని ఎంచుకొని ఉన్నత స్థానానికి ఎదిగారు. అందులోనూ మహిళలే అధికంగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల్లో సుమారు 53 మంది మహిళా వ్యవసాయ అధికారులు ఉన్నారు. ఇందులో ముగ్గురు ఏడీఏలు, ఏడుగురు ఏఓలు కాగా 43 మంది ఏఈఓలు ఉన్నారు. వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చిన ఈ వనితలు సాగులో రైతన్నలకు ప్రణాళికలు, మెళకువలు అందిస్తున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వారికందేలా చేస్తూనే.. చీడపీడల నుంచి పంటలను కాపాడుకునేందుకు సలహాలు ఇస్తున్నారు. నిరంతరం క్షేత్రస్ధాయిలో పర్యటించి అవగాహన కల్పిస్తున్నారు.
ఫ వ్యవసాయ శాఖలో 53 మంది
మహిళా అధికారులు
ఫ రైతులుగా తల్లిదండ్రుల కష్టం చూసి సాగు రంగంలో ఉద్యోగ ప్రస్థానం


