తిరుమలగిరి (తుంగతుర్తి), అర్వపల్లి, తుంగతుర్తి: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎలాంటి తప్పుల్లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ కోరారు. గురువారం తిరుమలగిరి మండల కేంద్రంతోపాటు జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం, తుంగతుర్తి మండల కేంద్రంలో సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను నమోదు చేయాలన్నారు. ఫారాలు పూరించే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటర్ల నుంచి పూర్తి సమాచారం సేకరించాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో తిరుమలగిరి మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్ తిరుమని యాదగిరి, అర్వపల్లి, తుంగతుర్తి తహసీల్దార్లు బాషపాక శ్రీకాంత్, దయానందం, డిప్యూటీ తహసీల్దార్లు జాన్ మహ్మద్, పాటి వెంకట్‌రెడ్డి, కంఠమయ్య, సిబ్బంది పరశురాములు, ఉమేష్, ఉప్పలయ్య, రాధ, పరమేశ్వరి, అరుణ, రేణుక తదితరులు పాల్గొన్నారు.


