డ్రగ్స్‌ నిర్మూలన అందరి బాధ్యత : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ నిర్మూలన అందరి బాధ్యత : ఎస్పీ

Jun 23 2026 10:24 AM | Updated on Jun 23 2026 10:24 AM

సూర్యాపేటటౌన్‌ : మాదకద్రవ్యాల (డ్రగ్స్‌) నిర్మూలనకు ప్రతి పౌరుడూ బాధ్యతగా పోరాడాలని ఎస్పీ నరసింహ అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో తెలంగాణ ఈగల్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యాంటీ డ్రగ్‌ సోల్జర్‌’ పౌరుల నమోదు ప్రక్రియను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి పౌరుడు యాంటీ డ్రగ్స్‌ సోల్జర్‌గా పేరు నమోదు చేసుకోవాలన్నారు. సూర్యాపేట జిల్లాను డ్రగ్స్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు పోలీస్‌ శాఖతో ప్రజలు చేతులు కలపాలన్నారు. సే నో టు డ్రగ్స్‌–సే ఎస్‌ టు లైఫ్‌ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. డ్రగ్స్‌ వినియోగం రవాణాకు సంబంధించిన సమాచారాన్ని 100, 112, 1908 నంబర్ల ఫోన్‌చేసి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీలు రవి, నరసింహాచారి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ మగ్దూం అలీ, ఎస్‌ఐ యాకూబ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

బాధితులకు భరోసా కల్పించాలి

వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించి భరోసా కల్పించాలని ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్‌ గ్రీవెన్స్‌డే కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా కృషిచేయాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement