భానుపురి (సూర్యాపేట) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ్ఙ(ఎస్‌ఐఆర్)కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్‌ఐఆర్‌పై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు బీఎల్‌ఓ లు ఇంటింటికీ తిరిగి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తారని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్ రాజ్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, నాయకులు చల్లమల్ల నరసింహ, చకిలం రాజేశ్వరరావు, స్టాలిన్, కోట గోపి, రమేష్ పాల్గొన్నారు. అదేవిధంగా శిక్షణ పొందిన బీఎల్‌ఓలకు సర్వే నిర్వహణకు అవసరమైన కిట్లు, ఇతర సామగ్రిని అందించారు.


