అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాటం

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

చివ్వెంల(సూర్యాపేట) : ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలపై పోరాడుతున్న విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు పెట్టిన తప్పుడు కేసులు ఎత్తి వేయాలని బీసీ హక్కుల సాధన సమతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ్‌నాయుడు డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీలు చేయక పోవడం వల్లే ప్రైవేట్‌ పాఠశాలలు నర్సరీ విద్యార్థులకు కూడా రూ.50 వేల ఫీజు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. బాధ్యత కలిగిన డీఈఓ తనిఖీ చేయకపోవడం వల్లే, పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తు పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లుట్ల కనకయ్య, సీపీఐ మండల కార్యదర్శి రాము, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement