ఇక..ఇంటింటికీ బీఎల్‌ఓలు | - | Sakshi
Sakshi News home page

ఇక..ఇంటింటికీ బీఎల్‌ఓలు

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

చిలుకూరు: కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్‌)కు క్షేత్రస్థాయి సిబ్బంది సిద్ధమయ్యారు. జిల్లాలో గురువారం నుంచి ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు గానూ బీఎల్‌ఓల శిక్షణ కార్యక్రమం పూర్తయింది. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి అవసరమైన సామగ్రిని అధికారులు మంగళవారం నుంచి తహసీల్దార్‌ కార్యాలయాల్లో పంపిణీ చేస్తున్నారు. బీఎల్‌ఓలు ఈ నెల 25 నుంచి ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలను అందించనున్నారు. ఇప్పటికే బీఎల్‌ఓలు క్షేత్ర స్థాయిలో మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. బోగస్‌, డబుల్‌ ఓట్లను, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లను తొలగించడంతో పాటు అర్హులైన వారి పేర్లు చేర్చనున్నారు.

పంపిణీ చేసిన సామగ్రి ఇదే..

క్షేత్ర స్థాయిలో ఓటర్ల ఇంటికి వెళ్లే బీఎల్‌ఓలకు ఎన్నికల సంఘం పలు రకాల సామగ్రి అందించింది. ఒక్కో బీఎల్‌ఓకు ఎన్యూమరేషన్‌ ఫారాలు, ప్రత్యేక బ్యాగ్‌, ఎన్యూరేషన్‌ ప్రక్రియ పూర్తియిన తరువాత ఇంటికి అంటించేందుకు క్యూఆర్‌కోడ్‌తో కూడిన స్టిక్కర్‌ అందిస్తున్నారు. బీఎల్‌ఓ బ్యాగ్‌లో గొడుగు, మినిట్స్‌ రిజిస్టర్‌, వాటర్‌ బాటిల్‌, ఫారమ్‌ –6తో పాటు మరో 15 వస్తువులు ఉన్నాయి.

ఫ రేపటి నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ

ఫ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేస్తున్న అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement