పది మంది ఎస్‌ఐల బదిలీ
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌లలో పని చేస్తున్న పది మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్ సూర్యాపేట ఎస్‌ఐ ఎం.అనిల్‌రెడ్డి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు, ఎన్.బాలునాయక్ సూర్యాపేట రూరల్ నుంచి వీఆర్‌కు, ఎం.ఐలయ్య వీఆర్ నుంచి ఆత్మకూర్.ఎస్‌కు, ఎన్.సందీప్‌రెడ్డి వీఆర్ నుంచి సూర్యాపేట వన్ టౌన్‌కు, బి.మోహన్‌బాబు వీఆర్ సూర్యాపేట నుంచి సూర్యాపేటటౌన్–2కు, ఏడుకొండలు సూర్యాపేట వన్‌టౌన్ నుంచి వీఆర్‌కు, మహేంద్రనాథ్ సూర్యాపేట వన్‌టౌన్ నుంచి వీఆర్‌కు, ఎస్‌కే.రహీమొద్దీన్ వీఆర్ నుంచి సూర్యాపేట వన్‌టౌన్‌కు, ఆర్.కనకరత్నం వీఆర్ నుంచి సూర్యాపేట టౌన్– 2, వి.వెంకన్న వీఆర్ సూర్యాపేట నుంచి చివ్వెంల పోలీస్ స్టేషన్‌లకు బదిలీ చేశారు.
లక్ష్మీనరసింహునికి
నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి మూల విరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. ఎదుర్కోళ్ల మహోత్సవం అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుపర్కపూజ, మాంగల్యాధారణ, తలంబ్రాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ మాడ వీధులలో స్వామివారి గరుడ వాహన సేవ చేపట్టారు. కార్యక్రమాలలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయ ఆచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
అర్వపల్లి: అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఆవరణలో పర్యాటక సంస్థకు సంబంధించిన అతిథిగృహ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని శనివారం సంస్థ ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. ఇటీవల ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో గెస్ట్‌హౌస్ నిర్మించడానికి నిధులు మంజూరు చేయిస్తానని ఇచ్చిన హామీ మేరకు రూ.60 లక్షలు మంజూరు చేయించారు. దాంతో భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజినీరింగ్ ఉమ్మడి జిల్లా డీఈ విద్యాసాగర్, ఏఈఈ మణికంఠ, ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని వారు చెప్పారు. వారి వెంట అధికారులు, ఆలయ అర్చకులు ఉన్నారు.
ఫ స్థలాన్ని పరిశీలించిన అధికారులు


