సూర్యాపేటటౌన్ : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి ఎండి జానీపాషా, సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.వెంకటేశులు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల పాలకమండలి జిల్లా ఉపాధి కల్పన సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. మొత్తం 237 అభ్యర్థులు పాల్గొనగా 57 మంది ఎంపికయ్యారు. అనంతరం అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నైపుణ్యంతోఉద్యోగాలు పొందవచ్చన్నారు. ఎస్వీ కళాశాలలో టాస్క్ ద్వారా ఏటా జాబ్‌మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్‌ఎస్‌ఆర్ శాస్త్రి ప్రోగ్రామ్ ఆఫీసర్ అశోక్, వివిధ కంపెనీల హెచ్‌ఆర్‌లు పాల్గొన్నారు.


