ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి | - | Sakshi
Sakshi News home page

ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి

Jun 22 2026 7:03 AM | Updated on Jun 22 2026 7:03 AM

సూర్యాపేటటౌన్‌ : రాష్ట్రంలోని ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, ప్రొఫెసర్‌ కె.లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి 27 వేల పాఠశాలను 4 వేలకు తగ్గించాలని ప్రకటించడం ఖండించదగిన విషయమన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య నేడు 65శాతంకి పైగా పెరిగిందన్నారు. తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టం చేసి అమలు పరచాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న ప్రైవేటీకరణ మరి ఎక్కడా లేదన్నారు. ఈ సమావేశంలో సీనియర్‌ జర్నలిస్టు రమణాచారి, రేపాక లింగయ్య, రాచూరి ప్రతాప్‌, తల్లమల్ల హస్సేన్‌, యోగానంద,షేక్‌ ఉమర్‌, అబ్దుల్‌కరీం, మాధవరెడ్డి, వెంకట్‌ యాదవ్‌, బుద్ధ సత్యనారాయణ, జనార్దన్‌, వీరబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement