ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ సాధిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ సాధిస్తాం

Jul 6 2026 1:46 AM | Updated on Jul 6 2026 1:46 AM

సూర్యాపేటటౌన్‌ : ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ను త్వరలోనే సాధిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన తూము శ్రీనివాస్‌రావు ఉద్యోగ విరమణ సన్మాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి, అధికారులతో సర్వీస్‌ రూల్స్‌ విషయమై చర్చించామన్నారు. సర్వీస్‌ రూల్స్‌ లేకపోడంతో విద్యాశాఖలో పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దాంతో విద్యా ప్రమాణాలు కుంటు పడుతున్నాయని చెప్పారు. లోకల్‌ బాడీ ఎన్నికలు పూర్తి కాగానే సర్వీస్‌ రూల్స్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొల్లు మధుసూదన్‌ రావు, ఎంఈఓ శేషగాని శ్రీనివాస్‌గౌడ్‌, దేవరశెట్టి జనార్దన్‌, సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తంగెళ్ల జితేందర్‌రెడ్డి, తీగల నరేష్‌, బొల్లికొండ కోటయ్య, శివశంకర్‌, వెంకటయ్య, దండుగుల ఎల్లయ్య, సుంకర లింగమూర్తి, జమాల్‌ షరీఫ్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement