ఒకే గదిలో విద్యాబోధన | - | Sakshi
Sakshi News home page

ఒకే గదిలో విద్యాబోధన

Jul 2 2026 6:49 AM | Updated on Jul 2 2026 6:49 AM

ఒకే గదిలో విద్యాబోధన

చిలుకూరు: మండలంలోని కొండాపురం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు 20 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం మూడు గదులు ఉండగా రెండు శిథిలావస్థకు చేరగా ఒక గది మాత్రమే అందుబాటులో ఉంది. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు– మన బడి పథకం కింద పాఠశాలకు మూడు తరగతి గదులు, మరుగుదొడ్లుకు నిధులు మంజూరయ్యాయి. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. తరువాత మధ్యలో వదిలేశారు. తరగతి గదులు పిల్లర్ల దశలో నిలిచిపోగా రెండు మరుగుదొడ్లు కొంత వరకు నిర్మించి వదిలేశారు. పాఠశాలలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement