మాది పేద వ్యవసాయ కుటుంబం. నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చదువుతున్నప్పుడు పాఠశాల ప్రిన్సిపాల్ సోమయ్య ప్రోత్సాహంతో పాఠశాల విద్య పూర్తి చేయగానే వ్యవసాయ శాఖ డిప్లోమాను 2011లో పూర్తి చేశాను. 2012లో వ్యవసాయ విస్తరణ అధికారిగా ఉద్యోగం లభించింది. 14 ఏళ్లుగా వివిధ మండలాల్లో రైతులకు సేవ చేస్తున్నాను. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నాను.
– గండూరి నిర్మల ఏఈఓ నేరేడుచర్ల


