నాన్న కోరిక మేరకే వ్యవసాయ అధికారిగా.. | - | Sakshi
Sakshi News home page

నాన్న కోరిక మేరకే వ్యవసాయ అధికారిగా..

Jul 5 2026 7:44 AM | Updated on Jul 5 2026 7:44 AM

ఆధునిక పద్ధతులపై అవగాహన

మాది మహబూబ్‌నగర్‌ జిల్లా. మానాన్న వ్యవసాయం చేసేవాడు. చదువులో చురుకుగా ఉండే నన్ను ఆయన ఎంతో ప్రోత్సహించేవాడు. వివిధ పనులపై వ్యవసాయశాఖ అధికారుల వద్దకు వెళ్లే ఆయన నన్ను కూడా వ్యవసాయ అధికారిగా చూడాలనుకునేవాడు. ఆయన కోరిక మేరకు నేను తిరుపతిలో ఏజీ బీయస్సీ పూర్తిచేశాను. 2005లో ఏఓగా ఎంపికై మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలలో పనిచేశాను. ప్రమోషన్‌పై ఏడీఏగా ప్రస్తుతం కోదాడలో పనిచేస్తున్నాను.

– పి. ప్రశాంతి, ఏడీఏ, కోదాడ

మాది ఆత్మకూర్‌ మండలం మిడతనపల్లి. మానాన్న రైతు కావడంతో చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం. ఈ రంగంపై ఇష్టంతోనే మధ్యప్రదేశ్‌లో బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేశాను. 2020లో ఏఈఓగా ఉద్యోగం లభించింది. వ్యవసాయ రంగంలో రైతులకు సలహాలు, సూచనలు లతో సేవలు అందిస్తున్నాను. రైతులకు సాగులో మెళకువలు, ఆధునిక పద్దతులు, సేంద్రీయ విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాము.

–ఎ.మహిత, ఏఈఓ తిరుమలగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement