చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్. అపూర్వ రవళి అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. 18 సంవత్సరాలలోపు విద్యార్థులు మోబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్ స్నేహం మంచిది కాదన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై విద్యార్థినులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, డీఎల్‌ఎస్‌ఏ నామినేటెడ్ సభ్యుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ కె.వెంకటరత్నం, ప్రిన్సిపాల్ గోలి పద్మ పాల్గొన్నారు.


