పెన్‌పహాడ్ : మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ ఆరోగ్య కార్యక్రమాలను, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వ్యాధి నిరోధక, అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమానికి సంబంధించిన స్క్రీనింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను నిరంతరం అప్‌డేట్ చేయాలని సిబ్బందికి సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమ ఏర్పాట్లపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పోలియో కార్యక్రమానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ వివరాలను పరిశీలించి, ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందేలా చూడాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి అజాగ్రత్త వహించొద్దని సూచించారు. క్షేత్రస్థాయిలో మైక్రో యాక్షన్ ప్లాన్ ప్రకారం పనిచేయాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట హెల్త్ అసిస్టెంట్లు జయశ్రీ, నాగలక్ష్మి, ఆశా కార్యకర్తలు ఇందిర, నాగలక్ష్మి, నాగమ్మ, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్


