గరిడేపల్లి : సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా భూసారం పెరుగుతుందని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త కిరణ్ అన్నారు. మండలంలోని కాల్వపల్లి గ్రామంలో బుధవారం శ్రీఖేత్ బచావో అభియాన్‌శ్రీ కార్యక్రమంలో భాగంగా రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసారాన్ని రక్షించేందుకు రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ప్రతి రైతు తన పొలంలో భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆ పరీక్షల ఫలితాల ఆధారంగా భూమికి అవసరమైన పోషకాలు, ఎరువులను మాత్రమే వాడాలన్నారు. దాంతో సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రీతంకుమార్, సర్పంచ్ ఎస్. వెంకన్న, పంచాయతీ కార్యదర్శి ఇంద్ర, రైతులు పాల్గొన్నారు.
ఫ గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త కిరణ్


