భానుపురి (సూర్యాపేట) : వివిధ సమస్యలపై ప్రజావాణిలో ప్రజలు అందించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులకు ఆయా శాఖలు కచ్చితమైన సమాచారాన్ని సంబంధిత ఫార్మాట్‌లో అందించాలన్నారు. ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. ప్రజావాణిలో మొత్తం 114 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ సన్యాసయ్య, సీపీఓ కిషన్ నాయక్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డి, డీఈఓ అశోక్, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ హరిసింగ్


