ఎన్నికల హామీలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల హామీలు అమలు చేయాలి

Jul 2 2026 6:49 AM | Updated on Jul 2 2026 6:49 AM

నల్లగొండ (భానుపురి) : ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడిలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా ప్రజల బతుకుల్లో మార్పు రావడం లేదన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు 21 హామీలు ఇచ్చారని, అందులో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఒక్క ఫ్రీ బస్సు మినహా మిగతా వాటిని అమలు చేయడం లేదన్నారు. రైతు భరోసా పూర్తిస్థాయిలో రైతులకు అందడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు, నాయకులు ఉస్తేల సృజన, మేకల శ్రీనివాస్‌, కంబాల శ్రీనివాస్‌, బద్దం కృష్ణారెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు బత్తినేని హనుమంతరావు, కొప్పోజు సూర్యనారాయణ, దేవరం మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement