గరిడేపల్లి : మొహర్రం వేడుకల్లో భాగంగా గరిడేపల్లిలోని ఆషుర్‌ఖానాలో ముజావర్లు సవార్లను నిలబెట్టారు. మంగళవారం ఉద యం మండల కేంద్రంలో పీర్లతో ఊరేగింపు నిర్వహించారు. డప్పుచప్పుళ్లు, భక్తుల పూనకాల మధ్య అన్ని వీధులలో ఊరేగింపు కొనసాగింది. భక్తులు తమ ఇంటి వద్దకు వచ్చిన సవార్లకు భక్తిశ్రద్ధలతో దట్టీలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కానుగు రాములు, ఎడవెల్లి రామకృష్ణ, తిరుమలగిరి వీరస్వామి, చామకూరి ఉదయ్, షేక్ బురాన్, ముజావర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.


