30న కళాశాలల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

30న కళాశాలల బంద్‌

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

సూర్యాపేట : ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 30న కళాశాలల బంద్‌ నిర్వహించనున్నట్లు బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్‌ వీరబోయిన లింగయ్య యాదవ్‌ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో సంఘం నాయకులతో కలిసి బంద్‌ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. బంద్‌కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బోనగిరి సతీష్‌, నాయకులు నారబోయిన లోకేష్‌, అజయ్‌, వంశీ, ధనుష్‌, జీవన్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎకై ్సజ్‌

సూపరింటెండెంట్‌గా అనిత

సూర్యాపేట : ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌శాఖ జిల్లా సూపరింటెండెంట్‌గా అనిత శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన లక్ష్మణ్‌నాయక్‌ ఆసిఫాబాద్‌ జిల్లాకు బదిలీ కాగా జనగాంలో పని చేస్తున్న అనిత సూర్యాపేటకు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

జాతీయ కార్యదర్శిగా సైదాబాబు

సూర్యాపేట(పెన్‌పహాడ్‌) : బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శిగా మండలంలోని తంగెళ్లగూడెం గ్రామానికి చెందిన చందా సైదా బాబును నియమించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, సంఘం జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ర్యాగ అరుణ్‌కుమార్‌ శనివారం హైదరాబాద్‌లో సైదాబాబుకు నియామక పత్రం అందించారు.

పోలీసుల తనిఖీలు

సూర్యాపేట : డ్రగ్స్‌, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అరికట్టడంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో పట్టణ పోలీసులు యాంటి నార్కోటిక్‌ డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. 60 ఫీట్లరోడ్‌, బస్టాండ్‌ వద్ద దుకాణాలు, పాన్‌ షాపులు, హోటల్స్‌, లాడ్జీలు, హాస్టళ్లలో తనిఖీలు చేపట్టారు. పట్టణ సీఐ వెంకటయ్య పాల్గొన్నారు.

తహసీల్దార్‌ కార్యాలయ భవనాలకు నిధులు

సూర్యిపేట (భానుపురి) : సూర్యాపేట జిల్లాలో కార్యాలయాలు లేని, శిథిలావస్థలో ఉన్న తహసీల్దార్‌ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జిల్లాలోని మద్దిరాల, కోదాడ, మోతె, మఠంపల్లి, ఆత్మకూర్‌ (ఎస్‌)లో భవనాలకు ప్రాధాన్యత ఇస్తూ ఒక్కో భవన నిర్మాణానికి రూ.2.25 కోట్లను విడుదల చేసింది.

పీహెచ్‌సీ వైద్యాధికారిపై బదిలీ వేటు

మునగాల: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ పి.రవీందర్‌పై బదిలీవేటు పడింది. అదే పీహెచ్‌సీలో పని చేస్తున్న మహిళా సిబ్బందిని సదరు వైద్యాధికారి వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ మహిళా సిబ్బంది డీఎంహెచ్‌ఓకు ఫిర్యా దు చేశారు. దాంతో పాటు ఎల్‌ఈసీకి, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. దాంతో వైద్యశాఖ అధికారులు ఈ విషయమై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. ఆమేరకు వైద్యాధికారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులకు సరేండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

లక్ష్మీనరసింహునికి

నిత్య కల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం అర్చకులు స్వామి వారి నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, ఈఓ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement