భానుపురి (సూర్యాపేట) : ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)–2026 ప్రక్రియలో సందేహాల నివృత్తికి కలెక్టరేట్‌లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. 2002 ఓటరు జాబితాలో వివరాల పరిశీలనతో పాటు ఇతర సాంకేతిక ఇబ్బందుల పరిష్కారానికి ఈ కేంద్రం నిరంతరం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
నైపుణ్యాభివృద్ధికి శిక్షణ
ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ప్రతిపాదన మేరకు జిల్లాలో ఎస్సీ అభ్యర్థుల కోసం వ్యవస్థాపకతతో కూడిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగ్రో ఆధారిత ఉత్పత్తులు, హెర్బల్ కాస్మెటిక్స్, ఫ్యాషన్ గార్మెంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఇతర స్వయం ఉపాధి రంగాలకు సంబంధించిన అంశాలపై నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. శిక్షణ కాలవ్యవధి ఎనిమిది రోజుల పాటు ఉంటుందని, శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు శిక్షణలో పాల్గొనేందుకు తమ పేర్లను tgsc bhhavitha. cgg.gov.inపోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.
సంప్రదించాల్సిన నంబర్లు
కలెక్టరేట్ ఆఫీస్ హెల్ప్‌డెస్క్ : 6281492368 బి.భరత్ (డీటీ ఎలక్షన్ సెల్) : 9573085943
కె.రణదీప్ (ఐటీ సపోర్ట్) 9059170790
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


