హుజూర్‌నగర్ : వరి సాగులో విత్తనాల ఎంపికే కీలమని ఎన్‌టీఆర్ జిల్లా జగయ్యపేట మండలం గరికపాడు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు విజయ భాస్కర్‌రెడ్డి, రవి కిషోర్, పామ్ మేనేజర్ నాగశ్రీ అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్ మండలం వేపల సింగారంలో రైతులు పోసిన వరినారు మడులు, విత్తనాల సంచులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గరికపాడు నుంచి దాదాపు వంద మంది రైతులు 300 కట్టల బీపీటీ 5204 రకం విత్తనాలు తెచ్చి నారు పోస్తే సరిగా మొలక రాలేదని తెలిపారు. అనంతరం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ అన్నిరకాల పరీక్షల తర్వాతనే విత్తనాలను విక్రయించామని, ప్రస్తుతం ఈ విత్తనాలను జర్మినేషన్ టెస్ట్‌కు పంపుతామన్నారు. కార్యక్రమంలో రైతులు సీహెచ్.రారెడ్డి, జి.వెంకటరెడ్డి, సీతారాంరెడ్డి, వీరమోహన్‌రెడ్డి, రాంరెడ్డి, కాశిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సైదులు, రాంమోహన్‌రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి
నేరేడుచర్ల : అధ్యాపకులు చెప్పే పాఠాలను విద్యార్థులు అర్థం చేసుకుని పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) బి.సులోచన అన్నారు. మంగళవారం నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో ఉండాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ ఏడాది కళాశాల ప్రారంభం నుంచే ప్రాక్టికల్ జరుగుతున్నాయన్నారు. అడ్మిషన్లు పెంచాలని అధ్యాపకులను కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నీరజ, అధ్యాపకులు వెంకటరమణ, సైదులు, ప్రణతి, కేఎల్‌ఎన్.రావు, జానకిరాంరెడ్డి, శ్రీనివాసులు, వెంకన్న, నరేందర్, నర్సింహాచారి, అంజయ్య, ప్రసాద్, గణేష్, అపర్ణ, వీరేష్ పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు, కల్యాణం చేపట్టి గరుడ వాహనంపై ఊరేగించారు. క్షేత్రపాలకుడైన శ్రీవీరాంజనేయస్వామికి ఆకు పూజ చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.


