మట్టపల్లిలో నిత్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

మట్టపల్లిలో నిత్య కల్యాణం

Jun 30 2026 7:07 AM | Updated on Jun 30 2026 7:07 AM

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో సోమవారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో పూజలు, అభిషేకం చేపట్టారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. శివాలయంలో శ్రీరామలింగేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ చలపతిరావు, అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, సాయిచార్యులు, నాగభూషణశర్మ పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికావు

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

బడుగుల లింగయ్య యాదవ్‌

నల్లగొండ (సూర్యాపేటటౌన్‌) : నల్లగొండ సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చేయడం సరైంది కావని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూతు పురాణంతో సీఎం హోదాను దిగార్చుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో పదేళ్లు మంత్రిగా జగదీష్‌రెడ్డి చేసిన అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్‌ రెండున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏందో చెప్తరా అని ప్రశ్నించారు. మరోమారు మాజీమంత్రి జగదీష్‌రెడ్డి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.

నానో ఎరువులతో

చాలా ప్రయోజనాలు

గరిడేపల్లి : రసాయన ఎరువుల కంటే నానో ఎరువుల వినియోగంతో అధిక దిగుబడి, ఎక్కువ లాభాలు, భూసారం పెరగడం లాంటి చాలా ప్రయోజనాలు చేకూరుతాయని కేవీకే గడ్డిపల్లి సీనియర్‌ శాస్త్రవేత్త, ప్రోగ్రామ్‌ ఇన్‌చార్జి డి.నరేష్‌ అన్నారు. గరిడేపల్లి మండలం గారకుంటతండాలో ఖేత్‌ బచావో అభియాన్ఙ్‌ (నేలలను రక్షించుకుందాం) కార్యక్రమంలో భాగంగా నానో ఎరువుల వాడకంపై సోమవారం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకొని, భూమికి అవసరమైన పోషకాలను అందించాలన్నారు. పలు విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఎ.కిరణ్‌, ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ ఎన్‌.సుగంధి, ఇఫ్కో మేనేజర్‌ ఎ.వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ బానోతు అరుణ, ఉపసర్పంచ్‌ గౌతమి, సుధాకర్‌, బి.హేమ్లా నాయక్‌, నరేందర్‌ నాయక్‌, రైతులు పాల్గొన్నారు.

శివాలయంలో

విశేష పూజలు

హుజూర్‌నగర్‌ (మేళ్లచెరువు) : మండల కేంద్రంలోని శ్రీఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం విశేషపూజలు నిర్వహించారు. స్వామి వారికి గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర నామార్చన, మహా లింగార్చన, పుష్పార్చన అనంతరం గోపూజ కార్యక్రమం చేపట్టారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement