6న గురుకులాల్లో ఇంటర్‌ స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

6న గురుకులాల్లో ఇంటర్‌ స్పాట్‌ అడ్మిషన్లు

Jul 5 2026 7:44 AM | Updated on Jul 5 2026 7:44 AM

నడిగూడెం : జిల్లాలోని ఆరు సాంఘీక సంక్షేమ బాలుర, బాలికల గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 6న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ సీహెచ్‌.పద్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు సోమవారం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. అనంతరం మెరిట్‌ లిస్ట్‌ తయారు చేసి, నోటీసు బోర్డులో ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

లక్ష్మీనరసింహునికి

నిత్య కల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం అర్చకులు స్వామివారి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.

పీఆర్‌సీ ప్రకటించి

అమలు చేయాలి

ఆత్మకూరు (ఎస్‌)(సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు నూతన పీఆర్‌సీ ప్రకటించి జూలై 2023 నుంచి అమలు చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా కోశాధికారి గుల్ల వెంకటయ్య డిమాండ్‌ చేశారు. శనివారం మండలంలోని కోటినాయక్‌ తండా, దుబ్బతండా, పాత సూర్యాపేట, ఏనుబాముల, ఆత్మకూరు పాఠశాలల్లో సంఘం సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను, బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఆరోగ్య కార్డులను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి చిలుక రమేష్‌, మండల అధ్యక్షుడు జటంగి లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యుడు నునావత్‌ సైదానాయక్‌, కడారి రాఘవులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులు

డ్రెస్‌కోడ్‌ పాటించాల్సిందే

గరిడేపల్లి ఎంఈఓ ఆదేశాలు

గరిడేపల్లి : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఫార్మల్‌ డ్రెస్‌కోడ్‌ పాటించాలని మండల విద్యాశాఖ అధికారి చత్రునాయక్‌ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు టీ షర్ట్‌, జీన్స్‌, టోపీలు ధరించి విధులకు హాజరు కావద్దన్నారు. మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ చీరల్లోనే విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుడి వ్యక్తిత్వమే విద్యార్థికి తొలి పాఠం అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, భారతీయ సంస్కృతి, వృత్తి గౌరవాన్ని పెంచే దిశగా డ్రెస్‌కోడ్‌ అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు

యాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement