బాధితులకు న్యాయం జరిగేలా కృషి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయం జరిగేలా కృషి

Jun 30 2026 7:07 AM | Updated on Jun 30 2026 7:07 AM

నల్లగొండ (సూర్యాపేటటౌన్‌) : బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా పోలీస్‌ అధికారులు కృషిచేయాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. సోమవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్‌ గ్రీవెన్స్‌డే కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క బాధితుడి సమస్యను విని, వాటి పరిష్కారం వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రజ రక్షణ కోసం ప్రతి పోలీస్‌ అంకిత భావంతో పనిచేయాలని కోరారు. ఆపదలో స్టేషన్‌కు వచ్చే వారికి పోలీసులం ఉన్నామంటూ భరోసానివ్వాలని ఆదేశించారు.

పోలీస్‌ శాఖకు మంచి పేరు తేవాలి

పదోన్నతి పొందిన సిబ్బంది పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాని ఎస్పీ నరసింహ సూచించారు. ఆర్ముడ్‌ రిజర్వ్‌లో కానిస్టేబుళ్లుగా పని చేస్తూ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన నంద కిషోర్‌, నాగరాజు, షేక్‌ రఫీ, రమేష్‌, కె.సతీష్‌, ఎం.సతీశ్‌, క్రాంతి, రవినాయక్‌లకు సోమవారం ఎస్పీ తన కార్యాలయంలో ప్రమోషన్‌ ఉత్తర్వులు అందజేసి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. బాధ్యతగా విధులు నిర్వహించాలని కోరారు. క్రమశిక్షణతో మెలగాలని, తోటి సిబ్బందిని గౌరవించాలని సూచించారు. విధుల నిర్వహిణలో సమన్వయంతో ముందుకెళ్తూ ఆరోగ్యాన్ని, కుటుంబాలను కూడా కాపాడుకోవాలని కోరారు.

ఫ ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement