లక్ష్మీనరసింహస్వామికి నిత్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీనరసింహస్వామికి నిత్య కల్యాణం

Jul 14 2026 6:10 AM | Updated on Jul 14 2026 6:10 AM

మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. కల్యాణోత్సవంలో భాగంగా ముందుగా ఎదుర్కోళ్ల మహోత్సవం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌ కుమార్‌, దేవాలయ అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

ఆర్‌ఎంపీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా రవిబాబు

మునగాల : రూరల్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని కలకోవ గ్రామానికి చెందిన దొంతగాని రవిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గట్టు వద్ద సోమవారం సంఘం వ్యవస్థాపకుడు తన్నీరు సత్యనారా యణ సమక్షంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు గట్ట రమాశంకర్‌, పొనుగోటి భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు నల్లగొండలో

జాబ్‌ మేళా

సూర్యాపేటటౌన్‌ : నల్లగొండలోని ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్‌ కళాశాలలో మంగళవారం అప్రెంటిస్‌–కమ్‌–ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సూర్యాపేట ప్రభుత్వ జూని యర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పెరుమాళ్ల యాదయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ, ప్రాంతీయ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత సంచాలక కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యోగ మేళాలో పారా మెడికల్‌, నాన్‌ పారా మెడికల్‌ విభాగాలకు చెందిన పలు ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి నెలకు రూ.9,600 స్టైపెండ్‌ అందిస్తారని తెలిపారు. 2023 నుంచి 2026 మధ్య వృత్తి విద్య పూర్తిచేసిన విద్యార్థులు, ఇటీవల ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన వారు ఈ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డు వెంట తీసుకు రావాలని సూచించారు.

శివాలయంలో పూజలు

మేళ్లచెరువు: మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాయలంలో సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్దన్‌శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement