హ్యామ్‌ రోడ్ల పైలాన్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

హ్యామ్‌ రోడ్ల పైలాన్‌ ఆవిష్కరణ

Jun 29 2026 5:22 AM | Updated on Jun 29 2026 5:22 AM

కనగల్‌ : కనగల్‌ మండల కేంద్రంలోని సబ్‌ మార్కెట్‌ యార్డ్‌ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి హ్యామ్‌ రోడ్ల పైలా న్‌ను ఆవిష్కరించారు. రూ.13,006.27 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 6,092.37 కిలోమీటర్ల పరిధిలో 441 రహదారులను విస్తరించి, పటిష్టపరచేందుకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుందని సీఎంతో పాటు మంత్రులు వెల్లడించారు. మెరుగైన రహదారుల నిర్మాణం ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడటమే కాకుండా వాణిజ్య, వ్యవసాయ రంగాల పురోగతికి ఊతమిస్తుందని చెప్పారు. ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement