మాది సన్నకారు రైతు కుటుంబం. మానాన్న కేవలం ఎకరంన్నర భూమిలో వ్యవసాయం చేసేవారు. తర్వాత సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో ఎల్‌డీసీగా చిన్నపాటి ఉద్యోగం పొందారు. అయినా వ్యవసాయాన్ని వీడలేదు. నాన్న వ్యవసాయంపై చూపుతున్న ఆసక్తిని గమనించి నేను కూడా ఈ రంగంపై మక్కువ పెంచుకున్నాను. రైతులకు ఏదోవిధంగా సహాయ పడాలని, అగ్రికల్చర్ బీఎస్సీలో చేరాను. 2011లో అగ్రికల్చర్ బీఎస్సీ ఖమ్మంలో పూర్తి చేశాను. ఆ వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడం, మొదటి ప్రయత్నంలోనే 2012 జూలైలో మండల వ్యవసాయ అధికారిగా ఉద్యోగం పొందాను. మద్దిరాల ఏఓగా ఉన్న సమయంలో ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డు పొందాను.
– దివ్య, ఆత్మకూర్ (ఎస్) మండల వ్యవసాయ అధికారి


