సూర్యాపేట (చివ్వెంల) : విద్యార్థులు చట్టాలపై అవగహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్. అపూర్వ రవళి అన్నారు. శనివారం జ్లిలా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల–2లో కార్మిక చట్టా లు, వెట్టిచాకిరిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ నామినేటెడ్ సభ్యుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌కుమార్, కె.ప్రియదర్శిని, న్యాయవాదులు టేకులపల్లి శ్రీనివాస్‌రావు, సుధాకర్ పాల్గొన్నారు.
ఫ మొదటి అదనపు జూనియర్ సివిల్
జడ్జి అపూర్వ రవళి


