హుజూర్‌నగర్ : ఎవరికై నా ఒకే చోట ఓటు ఉండాలని రెండు చోట్ల ఉంటే ఒక చోట ఓటు తొలగిస్తారని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ స్పష్టం చేశారు. బుధవారం హుజూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరికై నా రెండు చోట్ల ఓటు ఉంటే ఎక్కడ ఓటు ఉండాలో ముందే నిర్ణయించుకోవాలన్నారు. లేదా అధికారులే ఒక చోట తొలగిస్తారని చెప్పారు. కొత్త ఓట్ల నమోదు, తప్పుల సవరణ కోసం ప్రజలు సరైన వివరాలు అందించి సహకరించాలని కోరారు. ఎన్యుమరేషన్ ఫారాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్‌డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కవిత, బీఎల్‌ఓలు, తదితరులు ఉన్నారు.
ఇళ్ల నిర్మాణం పరిశీలన
హుజూర్‌నగర్ శివారులోని రామస్వామిగుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని కలెక్టర్ పరిశీలించారు. కాలనీలో మిగిలిన పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్‌డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్‌రెడ్డి, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, హార్టి కల్చర్ పీడీ నాగయ్య, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సతీష్‌కుమార్, తహసీల్దార్ కవిత, వివిద శాఖల అధికారులు, కాంటారక్టర్లు, తదితరులు ఉన్నారు.
ఫ రెండు చోట్ల ఉంటే ఒకటి తొలగింపు
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


