మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం నిత్య కల్యాణం చేపట్టారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
ఆలయ ఈఓగా
చలపతిరావు
మట్టపల్లి దేవస్థానం ఈఓగా టీవీ చలపతిరావు ఆదివారం ఆల య ధర్మకర్తల సమక్షంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జి ఈఓ పనిచేసిన జ్యోతి బదిలీకాగా జనగాంలో గల శ్రీచెన్నకేశవస్వామి ఆలయ ఈఓగా పనిచేస్తున్న చలపతిరావును ఇక్కడకు బదిలీచేస్తూ దేవాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేసింది.


