తుంగతుర్తి: నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల అధ్యక్షుల నియామకాల్లో ఎలాంటి మార్పు లేదని ఇదే ఫైనల్ అని ఎమ్మెల్యే మందుల సామేలు స్పష్టం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అందరి అభిష్టం మేరకే ఏఐసీసీ అధిష్టానం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడి ఆమోదంతో మండల అధ్యక్షుల నియామకాలు జరిగాయన్నారు. తనకు నియోజకవర్గంలో 52 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటానన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.2వేల కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. రోడ్ల కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మొత్తం పనులు ఆగిపోయాయని, ఈ విషయంపై సంబంధిత మంత్రి కోమటిరెడ్డి, అధికారులతో మాట్లాడి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు చెప్పారు. కేంద్రం తెచ్చిన సర్‌తో ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ విషయమై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేగటి రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సర్పంచులు మల్లేష్, ఝాన్సీ, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మందుల సామేల్


